బతుకమ్మ చీరల పంపిణీ.. మహిళలకు చీరలు అందజేసిన ఎమ్మెల్యే

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలోని  చెల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం పంపిణీ చేశారు. టీఆర్ఎస్  ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను, తెలుగింటి ఆడపడుచులకు పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణలో ముఖ్యమైన బతుకమ్మ పండుగకు, ప్రభుత్వం మహిళలకు చీరలు అందించడం ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందించడమే తమ లక్ష్యమని,పేద […]

Update: 2021-10-02 01:56 GMT
బతుకమ్మ చీరల పంపిణీ.. మహిళలకు చీరలు అందజేసిన ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను, తెలుగింటి ఆడపడుచులకు పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణలో ముఖ్యమైన బతుకమ్మ పండుగకు, ప్రభుత్వం మహిళలకు చీరలు అందించడం ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందించడమే తమ లక్ష్యమని,పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని ఆయన తెలియజేశారు. పంపిణీ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Tags:    

Similar News