నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని అన్ని కాలనీల అభివృద్ధికి దశలవారీగా పెద్దపీట వేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలోని హయత్‌నగర్ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. సీతారాంపురం కాలనీలో రూ.52.90 లక్షలతో వీడీసీసీ రోడ్డు, అంబేద్కర్ నగర్ కాలనీలో రూ.41 లక్షలతో సీసీ రోడ్డు, శివశక్తినగర్ కాలనీలో రూ.84.10 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు, […]

Update: 2020-07-30 10:10 GMT

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని అన్ని కాలనీల అభివృద్ధికి దశలవారీగా పెద్దపీట వేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలోని హయత్‌నగర్ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. సీతారాంపురం కాలనీలో రూ.52.90 లక్షలతో వీడీసీసీ రోడ్డు, అంబేద్కర్ నగర్ కాలనీలో రూ.41 లక్షలతో సీసీ రోడ్డు, శివశక్తినగర్ కాలనీలో రూ.84.10 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు, రామకృష్ణనగర్ కాలనీలో రూ.84.35 లక్షలతో వీడీసీసీ రోడ్డు పనులు చేపడతారని తెలిపారు.

Tags:    

Similar News