ఆటోనగర్ ఫారెస్ట్‌లో వాకింగ్ ట్రాక్ : సుధీర్ రెడ్డి
దిశ, ఎల్బీనగర్: ఆటోనగర్ ఫారెస్టులో మార్నింగ్ వాకర్లకు ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్టు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. శనివారం మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ఫారెస్టు అధికారులతో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫారెస్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన్సురాబాద్ డివిజన్‌లోని కేబీఆర్ నుంచి ఆటోనగర్ వెళ్లే దారిలోని అటవీ ప్రాంతంలో చుట్టు పక్కల కాలనీవాసుల సౌలభ్యం కోసం అటవీశాఖ గోడను కొంచెం […]
దిశ, ఎల్బీనగర్: ఆటోనగర్ ఫారెస్టులో మార్నింగ్ వాకర్లకు ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్టు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. శనివారం మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ఫారెస్టు అధికారులతో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫారెస్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన్సురాబాద్ డివిజన్‌లోని కేబీఆర్ నుంచి ఆటోనగర్ వెళ్లే దారిలోని అటవీ ప్రాంతంలో చుట్టు పక్కల కాలనీవాసుల సౌలభ్యం కోసం అటవీశాఖ గోడను కొంచెం కూల్చివేసి నూతనంగా గేటు నిర్మిస్తే మార్నింగ్ వాకింగ్‌కు వీలుంటుందని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఎక్కడ గేటు పెట్టాలో త్వరలోనే నిర్ణయం తీసుకొని పనులు చేపడతారని వివరించారు.