అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే చల్లా
దిశ, పరకాల: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఎంత ముఖ్యమో పేదలు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదిగాలని ఆయన ఆశించారన్నారు. అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమనే సంకల్పంతో అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారన్నారు. భారత […]
దిశ, పరకాల: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఎంత ముఖ్యమో పేదలు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదిగాలని ఆయన ఆశించారన్నారు.
అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమనే సంకల్పంతో అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి తరాలు గడుస్తున్నా, పేదలు బడుగు బలహీనవర్గాల పరిస్థితి మాత్రం మారలేదు అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. దళితుల ఆర్థిక ఎదుగుదల లక్ష్యంగా దళిత బందును ప్రవేశపెట్టడం దేశంలోనే చారిత్రాత్మకమన్నారు.
సోమవారం పట్టణంలోని ఎఫ్ జె గార్డెన్ లో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ప్రజలు అపోహలను వదిలేసి తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ సోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మడికొండ శీను, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ బొల్లె బిక్షపతి, నడికూడ మండల అధ్యక్షులు దరిశెట్టి చంద్రమౌళి, మాదారం పిఎసిఎస్ చైర్మన్ లింగమూర్తి, వార్డు కౌన్సిలర్ లు మడికొండ సంపత్, చిన్న సారయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.