రైతన్న సినిమాను ఆదరిద్దాం.. టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే బొల్లం పిలుపు
దిశ, కోదాడ: కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో గులాబీ శ్రేణులు […]
దిశ, కోదాడ: కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో గులాబీ శ్రేణులు భాగస్వాములు కావాలని సూచించారు. సెప్టెంబర్ 2న నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా పండుగను నిర్వహించి, 12వ తేదీలోపు గ్రామ, వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 12 నుంచి 20 వరకు మండల కమిటీలు వేయాలని సూచించారు. అన్ని కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 51శాతం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం సినీ దర్శకులు, నటులు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి ఇటీవల తీసిన ‘రైతన్న’ సినిమా పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ‘రైతన్న’ సినిమాను ఆదరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సుంకరి అజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, పుల్లారెడ్డి, లక్ష్మీ నారాయణ, ఎంపీపీలు, చింత కవితా రాధారెడ్డి, చుండూరు వెంకటేశ్వర్లు, యాతాకుల జ్యోతి మధుబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భాషబోయిన భాస్కర్‌రావు, గింజుపల్లి రమేష్ టీఆర్ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.