బోథ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ లో భారీ ముసలం మొదలైంది. ప్రస్తుత శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ నడుమ తీవ్ర విభేదాలు పొడసూపుతున్నాయి. ఈ రెండు వర్గాలు ఎవరికివారుగా వేరు కుంపట్లు పెట్టి రాజకీయాలు నెరపుతున్నారు. ఈ రెండు వర్గాలకు ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు ఆజ్యం పోస్తున్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ..! మాజీ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ గతంలో […]

Update: 2020-06-19 01:12 GMT

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ లో భారీ ముసలం మొదలైంది. ప్రస్తుత శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ నడుమ తీవ్ర విభేదాలు పొడసూపుతున్నాయి. ఈ రెండు వర్గాలు ఎవరికివారుగా వేరు కుంపట్లు పెట్టి రాజకీయాలు నెరపుతున్నారు. ఈ రెండు వర్గాలకు ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు ఆజ్యం పోస్తున్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ..!

మాజీ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ గతంలో బోథ్ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పలు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. మారిన సమీకరణల్లో 2014లో నగేష్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో ఎంపీగా మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు దఫాలు బోథ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతల నడుమ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ నగేష్ పర్యటనలను ఎమ్మెల్యే వర్గీయులు తప్పుబడుతున్నారు. ఏ హోదా లేకుండా ఆయన పర్యటనలు చేస్తూనే ప్రజలకు హామీలు ఇవ్వడంపై ఎమ్మెల్యే వర్గీయులు మండిపడుతున్నారు. అయితే తాను టీఆర్ఎస్ లో సీనియర్ నేతనేనని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో తప్పేమీ లేదని నగేష్ వర్గీయులు చెబుతున్నారు. ఇలా రెండు వర్గాలు విడిపోయి ఎవరికివారుగా రాజకీయాలు చేస్తుండటంతో కిందిస్థాయి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నగేష్ ఇక్కడినుంచి పోటీ చేయాలన్న ఆలోచనతోనే రెండో వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు వర్గాలకు ఉమ్మడి జిల్లా నేతల ప్రోత్సాహం..!

బోథ్ నియోజకవర్గంలో నెలకొన్న టీఆర్ఎస్ అంతర్గత విభేదాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర నేతలు వేరు వేరుగా రెండు వర్గాలను ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నలు నగేష్ ను తెరపైకి తెస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇతర కేడర్ కూడా రెండుగా విడిపోయి నట్లు పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

Tags:    

Similar News