అక్కడ ఉద్యమమే లేదు: అంబటి

దిశ, వెబ్‌డెస్క్: అమరావతిలో అసలు ఉద్యమమే లేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో పెద్ద స్కామ్ జరిగిందని.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ బినామీలతో వేల ఎకరాలు కొన్నారని అంబటి ఆరోపించారు. బలహీన వర్గాల భూములు తక్కువ ధరలకు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. అమరావతి స్కామ్‌లో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామని.. మరికొంత మందిని […]

Update: 2020-08-24 06:08 GMT
అక్కడ ఉద్యమమే లేదు: అంబటి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అమరావతిలో అసలు ఉద్యమమే లేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో పెద్ద స్కామ్ జరిగిందని.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ బినామీలతో వేల ఎకరాలు కొన్నారని అంబటి ఆరోపించారు. బలహీన వర్గాల భూములు తక్కువ ధరలకు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు.

అమరావతి స్కామ్‌లో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామని.. మరికొంత మందిని అరెస్ట్ చేస్తామని అంబటి స్పష్టం చేశారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు పారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అమరావతిలో భూస్వాముల ఉద్యమం జరుగుతోందన్నారు.

Tags:    

Similar News