వారం రోజుల పాటు ఈ ప్రాంతాల్లో వాటర్ బంద్..

దిశ, మర్రిగూడ: వారం రోజుల పాటు మిషన్ భగీరథ కృష్ణా జలాలు నిలిపివేస్తున్నట్లు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి మండలం‌లోని మిషన్ భగీరథ 70 ఎం‌ఎల్‌డి వాటర్ ప్లాంట్‌లో మరమ్మతులు ఉన్న దృష్ట్యా కృష్ణా జలాల త్రాగు నీటిని ఏడు రోజులు పాటు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఎస్‌డబ్ల్యూ లింగోటం వాటర్ ప్లాంట్ పరిధిలో ఉన్న చౌటుప్పల్, మర్రిగూడ, చండూరు, నాంపల్లి, నారాయణపురం, చింతపల్లి, దేవరకొండ, చందంపేట, గుండ్లపల్లి, కొండమల్లె‌పెళ్లి, గుర్రంపోడు, పోచంపల్లి, వలిగొండ […]

Update: 2021-12-07 09:33 GMT

దిశ, మర్రిగూడ: వారం రోజుల పాటు మిషన్ భగీరథ కృష్ణా జలాలు నిలిపివేస్తున్నట్లు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి మండలం‌లోని మిషన్ భగీరథ 70 ఎం‌ఎల్‌డి వాటర్ ప్లాంట్‌లో మరమ్మతులు ఉన్న దృష్ట్యా కృష్ణా జలాల త్రాగు నీటిని ఏడు రోజులు పాటు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఎస్‌డబ్ల్యూ లింగోటం వాటర్ ప్లాంట్ పరిధిలో ఉన్న చౌటుప్పల్, మర్రిగూడ, చండూరు, నాంపల్లి, నారాయణపురం, చింతపల్లి, దేవరకొండ, చందంపేట, గుండ్లపల్లి, కొండమల్లె‌పెళ్లి, గుర్రంపోడు, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో బుధవారం నుండి ఏడురోజుల పాటు త్రాగునీటి సరఫరా‌ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత సర్పంచులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News