జాడలేని అధికార పార్టీ నాయకుడు.. ఆందోళనలో అధిష్టానం
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ వైపున మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో తలమునకలై ఉన్న అధికార పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నాయకుడు ఆచూకి లేకుండా పోవడం కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి జాడ దొరకక అటు పార్టీ కేడర్, ఇటు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు శుక్రవారం అర్థరాత్రి 11.50 నిమిషాల నుండి కాంటాక్ట్ లో లేకుండా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ వైపున మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో తలమునకలై ఉన్న అధికార పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నాయకుడు ఆచూకి లేకుండా పోవడం కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి జాడ దొరకక అటు పార్టీ కేడర్, ఇటు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు శుక్రవారం అర్థరాత్రి 11.50 నిమిషాల నుండి కాంటాక్ట్ లో లేకుండా పోయాడని తెలుస్తోంది. అయితే అతని ఆయన ఎక్కడికెళ్లాడు అన్న విషయం తెలుసుకునే పనిలో పోలీసు అధికారుల పడ్డారని సమాచారం. గన్ మెన్లకు కూడా తెలియకుండా వెళ్లిపోయిన ఆ నాయకుడు ఉన్న ఫళంగా అదృశ్యం కావడం వెనక ఆంతర్యం ఏంటో అంతుచిక్కకుండా తయారైంది.
టీఆర్ఎస్ పార్టీ కేడర్ కూడా ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని సమీప వ్యక్తులకు ఫోన్ చేస్తే మరో మూడు రోజుల వరకు కాంటాక్ట్ లోకి రాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న సమాధానం వస్తోందని అంటున్నారు. శనివారం సాయత్రమే ఆ ప్రజాపతినిధి గన్ మెన్లు కూడ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. గత మూడు రోజులుగా సదరు ప్రజా ప్రతినిధి తమకు అందుబాటులో లేకుండా పోయాడని సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం దృవీకరించడం లేదు. గన్ మెన్లు వచ్చి రిపోర్ట్ చేసిన విషయం బయటకు పొక్కకుండా పోలీసు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వల్లే సీక్రెట్ గా ఉంచుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆ ప్రజాప్రతినిధికి సంబందించిన సన్నిహితులు, బంధువులను కూడా ఆరా తీస్తున్నప్పటికీ ఎలాంటి సమాచారం దొరకడం లేదు.