యూపీ టు అస్సాం.. ఐదేళ్ల తర్వాత ఆ బాలుడు ఇంటికి ..!
దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ పోలీసులు రూపొందించిన దర్ఫణ్ యాప్ ద్వారా ఐదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ ఆటిజం బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘన్ శ్యామ్ సోని కుమారుడు తన నివాసం వద్ద 2015 జూలై 14వ తేదీన అలహాబాద్ హందియా ప్రాంతంలో తప్పిపోయాడు. తమ కుమారుడు కోసం వెతికి వెతికి విసుగెత్తిన తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. అయితే, తప్పిపోయిన బాలుడు సోమ్ సోని 2015 జూలై 23న అస్సాం రాష్ట్రంలోని గోలపారలో […]
దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ పోలీసులు రూపొందించిన దర్ఫణ్ యాప్ ద్వారా ఐదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ ఆటిజం బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘన్ శ్యామ్ సోని కుమారుడు తన నివాసం వద్ద 2015 జూలై 14వ తేదీన అలహాబాద్ హందియా ప్రాంతంలో తప్పిపోయాడు. తమ కుమారుడు కోసం వెతికి వెతికి విసుగెత్తిన తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. అయితే, తప్పిపోయిన బాలుడు సోమ్ సోని 2015 జూలై 23న అస్సాం రాష్ట్రంలోని గోలపారలో తారాసపడటంతో స్థానిక ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి.. స్థానిక హోంలో చేర్పించారు.
ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా తప్పిపోయిన వారిని గుర్తించేందుకు తెలగాణ పోలీసులు రూపొందించిన దర్పణ్ మొబైల్ యాప్ ద్వారా తప్పిపోయిన బాలుడు సోమ్ సోనీ ఫోటోను ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్పణ్‌లో అప్లోడ్ చేశారు. అదే విధంగా అస్సాంలోని పోలీసుల సహాయంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిబ్బంది కూడా సోమ్ సోని ఫోటోను అప్ లోడ్ చేశారు. దీంతో ఈ యాప్లో ఉండే ఫేస్ రికగ్నజేషన్ ద్వారా సోమ్ సోనిని టీఎస్ పోలీసులు గుర్తించారు.
వెంటనే ఆ ఫోటోను అప్ లోడ్ చేసిన అస్సాం పోలీసులకు, ఉత్తరప్రదేశ్ పోలీసులకు తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాబును గుర్తించి, అస్సాంలోని హోంకు వెళ్ళారు. ఒక్కసారిగా తప్పిపోయిన 5 సంవత్సరాల తర్వాత తమ కుమారుడు కనిపించేసరికి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాలు తప్పిపోయిన కుమారుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంపై హర్షం వ్యక్తం చేశారు.