ఫ్లాష్ ఫ్లాష్: టీఆర్ఎస్ నేతల కొట్లాట.. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై కర్రలతో దాడి..!

దిశ, జల్​పల్లి : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో బీజేపీ పార్టీ కార్పొరేటర్ల ఫ్లెక్సీ వివాదం మరవక ముందే మీర్​ పేట్ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాట తెరపైకి వచ్చింది. శుక్రవారం మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ జనరల్​ బాడీ సమావేశం సందర్భంగా గురువారం సాయంత్రం ఆర్​ఎన్​ రెడ్డి నగర్​లోని శ్రీ విద్యా వాణి హైస్కూల్​లో సమావేశం జరుగుతుండగానే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన […]

Update: 2021-08-12 22:17 GMT

దిశ, జల్​పల్లి : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో బీజేపీ పార్టీ కార్పొరేటర్ల ఫ్లెక్సీ వివాదం మరవక ముందే మీర్​ పేట్ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాట తెరపైకి వచ్చింది. శుక్రవారం మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ జనరల్​ బాడీ సమావేశం సందర్భంగా గురువారం సాయంత్రం ఆర్​ఎన్​ రెడ్డి నగర్​లోని శ్రీ విద్యా వాణి హైస్కూల్​లో సమావేశం జరుగుతుండగానే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన బిగ్ ఫైట్ తీవ్ర కలకలం రేపింది.

డిప్యూటి మేయర్​ తీగల విక్రమ్​ రెడ్డితో పాటు సమావేశంలో పాల్గొన్న 15 మంది కార్పొరేటర్లపై 10వ వార్డుకు చెందిన ముద్ద పవన్​ కార్పొరేటర్​, అతని 30 మంది అనుచరులతో కలిసి భీభత్సం సృష్టించారు. తమ వెంట తెచ్చుకున్న హాకీ స్టిక్స్, కర్రెలతో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ లపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35వ కార్పొరేటర్​ జిల్లా సౌందర్య భర్త, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిల కు గాయాలయ్యాయి. కుర్చీలు విసురుతుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆయనకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

తనను కులం పేరుతో దూషించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ 35వ డివిజన్ కార్పొరేటర్ భర్త మీర్​ పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్ ​ పరిధిలోని 10వ డివిజన్​ టీఆర్ఎస్​ పార్టీ కార్పొరేటర్​ ముద్ద పవన్ జిల్లాల్ గూడలో నాలుగు కోట్లతో ఓ చెరువు సుందరీకరణ పనులకు కాంట్రాక్ట్ చేపట్టారు. దానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సగం బిల్లు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆ పనులకు సంబంధించిన కమిషన్ పెద్ద మొత్తంలో తమకు ఇవ్వాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారని, ఆ కారణంగానే బిల్లు అపారన్న నెపంతో ముద్ద పవన్ దాడికి తెగబడినట్లు సమాచారం. గొడవ జరిగిన విషయమై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా దీసి, ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News