మీడియా ముందుకు మైనర్ బాలిక అత్యాచార నిందితులు
దిశ, జడ్చర్ల: పట్టణంలో సంచలనం రేపిన ఓ మైనర్ అమ్మాయి అత్యాచారం కేసులో పట్టుబడ్డ నిందితులు చివరికి కటకటాల పాలయ్యారు.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సంచలనం రేపిన ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసులో నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు డీఎస్పీ శ్రీధర్. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికకు రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన దేవర కాడి మహేష్ జడ్చర్ల పట్టణంలోని సరస్వతి […]
దిశ, జడ్చర్ల: పట్టణంలో సంచలనం రేపిన ఓ మైనర్ అమ్మాయి అత్యాచారం కేసులో పట్టుబడ్డ నిందితులు చివరికి కటకటాల పాలయ్యారు.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సంచలనం రేపిన ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసులో నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు డీఎస్పీ శ్రీధర్. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికకు రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన దేవర కాడి మహేష్ జడ్చర్ల పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తన స్నేహితుడు పంచాయతీ సెక్రెటరీ సంపంగి మహేష్ వద్దకు తరచూ వస్తుండడంతో.. అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడని తెలిపారు. ఆమెకు ఆన్లైన్ క్లాసు చెప్తూ పలుమార్లు ఆ అమ్మాయిని రాజాపూర్ మండల కేంద్రానికి తీసుకువెళ్లి శారీరకంగా వాడుకున్నాడని వెల్లడించారు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈనెల 4వ తేదీన హైదరాబాదులోని ఓ బ్యాంకులో తమ వద్ద ఉన్న సిల్వర్ ప్లేట్లను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బాలికను ఉంచాడని తెలిపారు.
అంతలోనే అమ్మాయి కుటుంబీకులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో తన అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని, అంతలోనే విషయం తెలుసుకున్న మహేష్ భయపడి అమ్మాయిని వెంటనే తిరిగి జడ్చర్లకు పంపించాడని తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు దేవర కాడి మహేష్‌ని కూడా అదుపులోకి తీసుకొని వారిపై పోక్సో యాక్ట్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.