జిల్లాల్లో రాష్ట్రావతరణ వేడుకలకు మంత్రులు

దిశ, న్యూస్‌బ్యూరో ఈసారి రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా జరపాలనుకుంటున్న ప్రభుత్వం జిల్లాల్లో ఎక్కడికక్కడ మంత్రులు జాతీయ పతాకాలను ఎగురవేయాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. జిల్లాల్లో మాత్రం మంత్రులకు ఆ బాధ్యతలను అప్పజెప్పారు. ఏ జిల్లాలో ఏ మంత్రి పాల్గొనాలి అనే జాబితాను ప్రభుత్వం తయారుచేసింది. అదిలాబాద్‌కు మంత్రి గంప గోవర్థన్, జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్, యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ప్రభుత్వ విప్‌ పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ […]

Update: 2020-05-28 11:27 GMT

దిశ, న్యూస్‌బ్యూరో
ఈసారి రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా జరపాలనుకుంటున్న ప్రభుత్వం జిల్లాల్లో ఎక్కడికక్కడ మంత్రులు జాతీయ పతాకాలను ఎగురవేయాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. జిల్లాల్లో మాత్రం మంత్రులకు ఆ బాధ్యతలను అప్పజెప్పారు. ఏ జిల్లాలో ఏ మంత్రి పాల్గొనాలి అనే జాబితాను ప్రభుత్వం తయారుచేసింది. అదిలాబాద్‌కు మంత్రి గంప గోవర్థన్, జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్, యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ప్రభుత్వ విప్‌ పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జెడ్పీ, కలెక్టరేట్ భవనాల్లో ఉదయం 8.30 గంటలకు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 32 జిల్లాల్లో ఎవరెవరు ఎక్కడ జెండా ఎగురవేయాలో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News