ఏపీలో గణేష్ ఉత్సాలకు అనుమతి లేదు

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వినాయక చవితి వేడుకలు మొదలు కానున్నాయి. దీని కోసం అనేక మంది యువకులు, భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతేగాకుండా ఇప్పటికే అనేకమంది విగ్రహాలను కూడా బుక్ చేసుకున్నారు. కాగా ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వినాయక చవితి వేడుకలపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. […]

Update: 2020-08-19 11:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వినాయక చవితి వేడుకలు మొదలు కానున్నాయి. దీని కోసం అనేక మంది యువకులు, భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతేగాకుండా ఇప్పటికే అనేకమంది విగ్రహాలను కూడా బుక్ చేసుకున్నారు. కాగా ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వినాయక చవితి వేడుకలపై స్పష్టతనిచ్చింది.

ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం దేవాదాయశాఖ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News