శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం: తలసాని
దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఇందిరా పార్కు వద్ద చేపట్టే ధర్నా ఏర్పాట్లను హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని, వారికి మద్దతుగా టీఆర్ఎస్ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఇందిరా పార్కు వద్ద చేపట్టే ధర్నా ఏర్పాట్లను హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని, వారికి మద్దతుగా టీఆర్ఎస్ హైదరాబాద్‌లో ఈ నెల12న భారీ ధర్నా చేపడుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రోత్సహించకుండా ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నల్లచట్టాలను తీసుకొచ్చి, రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. అయినప్పటికీ, రాష్ట్రంలో బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరించారు.