కరోనా కేసులు భారీగా పెరుగుతాయ్ : తలసాని
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రాబోయే రోజుల్లో కరోనా వైరస్ విజృంభించనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైరస్ నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్ నుంచి ఏ ఒక్కరూ వెళ్లాల్సిన అవసరం లేదని, ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉంటే సరిపోతుందని మంత్రి తెలిపారు. ఈ వైరస్ 75 శాతం మందికి వస్తుంది, పోతుందని, కొంత మందికి వారికి తెలియకుండనే వచ్చి పోతుందని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిఫ్యూటీ స్పీకర్ పద్మారావు, వీహెచ్ […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రాబోయే రోజుల్లో కరోనా వైరస్ విజృంభించనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైరస్ నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్ నుంచి ఏ ఒక్కరూ వెళ్లాల్సిన అవసరం లేదని, ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉంటే సరిపోతుందని మంత్రి తెలిపారు. ఈ వైరస్ 75 శాతం మందికి వస్తుంది, పోతుందని, కొంత మందికి వారికి తెలియకుండనే వచ్చి పోతుందని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిఫ్యూటీ స్పీకర్ పద్మారావు, వీహెచ్ వంటి నేతలకు వారి సహయకులు, భద్రతాసిబ్బంది వల్లనే కరోనా వైరస్ సోకిందని వెల్లడించారు.
తెలంగాణలో కరోనా నివారణ చర్యలను, రోగులకు అందిస్తున్న చికిత్సల తీరును కేంద్రం, ఐసీఎంఆర్ ప్రశంసిస్తుంటే విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లందరూ భయపడాల్సిన పనిలేదు. లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ విధించాలా? వద్దా? విషయం పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.