ఉజ్జయిని మహంకాళికి తొలి బోనం సమర్పించిన తలసాని

దిశ, వెబ్‌డెస్క్ : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించారు. తలసాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం, నైవేధ్యం సమర్పించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా సికింద్రాబాద్ తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే నగర సీపీ […]

Update: 2021-07-24 22:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించారు. తలసాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం, నైవేధ్యం సమర్పించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా సికింద్రాబాద్ తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే నగర సీపీ అంజనీ కుమార్ ఆలయ పరిసరాల్లో ఆది, సోమవారం ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

కాగా, కొవిడ్ కారణంగా గతంలోకంటే ప్రస్తుతం ఆలయానికి భక్తుల తాకిడి తగ్గింది. అమ్మవారిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మంద కృష్ణ మాదిగ, నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహబూబ్ బాడ్ ఎంపీ బానోతు కవిత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మోండా కార్పొరేటర్ కొంతం దీపికా తదితరులు దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.

Tags:    

Similar News