పార్టీలో వారికే అవకాశాలు.. నూతన కమిటీలపై తలసాని క్లారిటీ
దిశ, కంటోన్మెంట్: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గ నేతలతో సమావేశమై నూతన కమిటీల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏకాభిప్రాయంతోనే పార్టీ నూతన కమిటీల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల కమిటీలలో స్థానం కోసం […]
దిశ, కంటోన్మెంట్: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గ నేతలతో సమావేశమై నూతన కమిటీల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏకాభిప్రాయంతోనే పార్టీ నూతన కమిటీల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల కమిటీలలో స్థానం కోసం పోటీ నెలకొందన్నారు. బస్తీ, బూత్, సోషల్ మీడియా కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి ఆరుణ, ఉప్పల తరుణి తదితర నాయకులు పాల్గొన్నారు.