జనవరి 9న అమ్మఒడి రెండో విడత సాయం
దిశ, ఏపీ బ్యూరో: 2020-21 ఏడాదికి సంబంధించి జనవరి 9న జగనన్న అమ్మ ఒడి పథకం రెండో విడత సాయం అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి రెండో విడత చెల్లింపుల్లో భాగంగా షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈనెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయల్లో ప్రదర్శనకు పెడతామన్నారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో సీఎం […]
దిశ, ఏపీ బ్యూరో: 2020-21 ఏడాదికి సంబంధించి జనవరి 9న జగనన్న అమ్మ ఒడి పథకం రెండో విడత సాయం అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి రెండో విడత చెల్లింపుల్లో భాగంగా షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈనెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయల్లో ప్రదర్శనకు పెడతామన్నారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం కింద మొదటి విడతగా 43,54,600లపైగా లబ్ధిదారులకు రూ.6,336 కోట్లు అందజేశామన్నారు. ఇప్పటికే అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 10 తేదీ నుంచి ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 20 వరకూ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.