ఏపీ సీఎం జగన్‌ది వితండవాదం
దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్ల విషయంలో ఏపీ వితండవాదం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నుంచి దృష్టి మళ్లించడానికి పోలీస్ బలగాల మోహరిస్తూ పనికిరాని అంశాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. వివాదాలను అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చుకుందామని, సుప్రీం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుందామని చెప్పింది జగన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్ల విషయంలో ఏపీ వితండవాదం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నుంచి దృష్టి మళ్లించడానికి పోలీస్ బలగాల మోహరిస్తూ పనికిరాని అంశాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. వివాదాలను అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చుకుందామని, సుప్రీం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుందామని చెప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు లో కేసు విత్ డ్రా చేసుకుంటే కొత్త కేటాయింపులు జరుగుతాయని దాని ప్రకారమే ప్రాజెక్టులు కడుతామని చెప్పింది జగన్ కాదా? కొత్తగా కేటాయింపులు జరగనిది జగన్ అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.
ఉమ్మడి ఏపీలో జారీ చేసిన జీవోల ప్రకారమే మేము కృష్ణా జలాలపై ప్రాజెక్టులు కడుతున్నామని, ఈ ప్రాజెక్టులు అక్రమం అంటే అపుడు జారీ చేసిన జీవోలు అక్రమమా ? అని నిలదీశారు. ఏపీకి 30 శాతం కేటాయింపులు జరిగితే 60 శాతం నీళ్లు వాడుకునేందుకు అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు.
అన్నిటిని కేంద్ర స్థాయిలో పరిష్కరించుకుందామని జగన్ అంటుంటే అనుమానం కలుగుతోందని తెలిపారు. కేంద్రంతో కుమ్మకై అక్రమ ప్రాజెక్టులు కొనసాగిద్దామని జగన్ ఉద్దేశమా ? అన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పీఎం మోడీ ఎన్నికల సందర్భంగా మాట్లాడారు. ఈ విషయంలో మోడీ మాకు న్యాయం చేయాలి. తెలంగాణ పోరాటాల గడ్డ. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపుతాం.. మా ప్రాజెక్టులు కొనసాగించి తీరుతాం అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.