ప్రయత్నం చేస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: చదువుతోనే సమజాభివృద్ధి అవుతుందనే నమ్మకంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ పట్టణం ఏనుగొండలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ)లో రూ. 205 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలతోపాటు […]
దిశ, మహబూబ్ నగర్: చదువుతోనే సమజాభివృద్ధి అవుతుందనే నమ్మకంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ పట్టణం ఏనుగొండలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ)లో రూ. 205 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలతోపాటు కేజీబీవీ లను నిర్మించి నిరుపేదలకు విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అనంతరం వెంకటేశ్వర కాలనీలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కొరమోని వెంకటయ్య, రాము, పురుషోత్తం, డీఈఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.