ఆర్టీసీ బస్సులో మంత్రి జర్నీ

దిశ, మహబూబ్ నగర్: లాక్‌డౌన్ సడలింపులతో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్కెక్కాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24 అర్థరాత్రి నుంచే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు మూసివేసింది. నాటి నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రకటనతో తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే బస్సుల్లో ప్రయాణించేటపుడు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం స్వయంగా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ […]

Update: 2020-05-19 07:33 GMT

దిశ, మహబూబ్ నగర్: లాక్‌డౌన్ సడలింపులతో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్కెక్కాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24 అర్థరాత్రి నుంచే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు మూసివేసింది. నాటి నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రకటనతో తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే బస్సుల్లో ప్రయాణించేటపుడు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం స్వయంగా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News