ఇది గొప్ప కార్యక్రమం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి ఇక్కరూ తమవంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10  గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ లో మంత్రుల నివాసంలోని నర్సరీలో దోమలు  పెరగడానికి అవకాశమున్న.. వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూలతొట్టిలోని నీటిని మంత్రి స్వయంగా పరిశీలించి, ఆ నీటిని తొలగించారు. […]

Update: 2020-07-12 00:41 GMT

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి ఇక్కరూ తమవంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ లో మంత్రుల నివాసంలోని నర్సరీలో దోమలు పెరగడానికి అవకాశమున్న.. వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూలతొట్టిలోని నీటిని మంత్రి స్వయంగా పరిశీలించి, ఆ నీటిని తొలగించారు. దోమలు నివాసం ఉండే ప్రాంతాలైన పూల కుండీలు, వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మంత్రి నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అవగాహన కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నామన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News