పంట కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు

దిశ, మహబూబ్ నగర్: రబీ పంట కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.37 వేల కోట్లు సమకూర్చిందని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దనీ, పండించిన […]

Update: 2020-04-02 08:44 GMT

దిశ, మహబూబ్ నగర్: రబీ పంట కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.37 వేల కోట్లు సమకూర్చిందని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దనీ, పండించిన ప్రతి గింజనూ కొంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామనీ, అలాగే, గ్రామ పంచాయతీల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు గుర్తించామని చెప్పారు. గ్రామాలలో రైతుబంధు సభ్యులు, గ్రామ, మండల స్థాయి కమిటీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు, సభ్యులందరూ పూర్తి స్థాయిలో పాల్గొని సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వరి పంట కోసేందుకు జిల్లాలో 676 యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటిని మండల కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి ఎక్కడికి అవసరమైతే అక్కడికి పంపించే ఏర్పాటు చేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్‌కు లేదా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, కలెక్టర్ నెంబర్‌‌లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తైన వెంటనే డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. అలాగే, ధాన్యం అమ్మేటప్పుడు కరోనా సోకకుండా సామాజిక దూరం పాటించాలని సూచించారు. రైతులకు, యంత్రాలపై పని చేసే వారికి కూడా శానిటైజర్, మాస్కులు ఇవ్వాలని చెప్పారు.

tags: minister, srinivas goud, crop, ikp, Civil Supplies

Tags:    

Similar News