సైనికుడిలా పని చేయాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, మహబూబ్ నగర్ : దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సమయం చూసి పనిచేస్తే మనం సురక్షితంగా ఉండగలమా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన డిప్యూటీ తహశీల్దార్లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులను స్ఫూర్తిగా తీసుకుని రోజువారీ మన పనిని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ ఆఫీసుకు వచ్చే పేదవాడి కన్నీళ్లు తుడిస్తే కలిగే తృప్తి కోట్లు సంపాదించిన రాదని తెలిపారు. మీ […]

Update: 2020-07-25 07:48 GMT

దిశ, మహబూబ్ నగర్ :
దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సమయం చూసి పనిచేస్తే మనం సురక్షితంగా ఉండగలమా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన డిప్యూటీ తహశీల్దార్లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులను స్ఫూర్తిగా తీసుకుని రోజువారీ మన పనిని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

రెవెన్యూ ఆఫీసుకు వచ్చే పేదవాడి కన్నీళ్లు తుడిస్తే కలిగే తృప్తి కోట్లు సంపాదించిన రాదని తెలిపారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చారు. వారి ఆశలను వమ్ము చేయరాదని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్లతో పాటు 10మంది వికలాంగులకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News