గిరిజనుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
దిశ ప్రతినిధి, వరంగల్: జీవో 3ని కొనసాగించాలని సీఎం కేసిఆర్ మార్గదర్శనంలో సోమవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రారంభమైన మొదటిరోజునే ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్ఫుటం అవుతోందన్నారు. జీవోని కొట్టివేస్తే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, వారికి న్యాయం జరిగేలా ఈ జీవోను పునరుద్ధరించాలంటూ ఈ రివ్యూ పిటిషన్ […]
దిశ ప్రతినిధి, వరంగల్: జీవో 3ని కొనసాగించాలని సీఎం కేసిఆర్ మార్గదర్శనంలో సోమవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రారంభమైన మొదటిరోజునే ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్ఫుటం అవుతోందన్నారు. జీవోని కొట్టివేస్తే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, వారికి న్యాయం జరిగేలా ఈ జీవోను పునరుద్ధరించాలంటూ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె వివరించారు. ఇవేవి తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర నేతలు ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ జీవో 3ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.