ఘట్‌కేసర్ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారం

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనపై జిల్లా ఇంఛార్జి మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి సంబంధిత అధికారులకు అమ్మాయికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ను వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఆదేశాలు […]

Update: 2021-02-11 01:30 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనపై జిల్లా ఇంఛార్జి మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి సంబంధిత అధికారులకు అమ్మాయికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ను వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. మేడిపల్లిలోని క్యూర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ మేరకు మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యకు సూచించారు.

Tags:    

Similar News