పెండింగ్ పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందించండి

దిశ, రంగారెడ్డి: జిల్లాలో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వెంటనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మీర్‌పేట్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులపై గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో తన కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్‌డౌన్ తొలగించాక ముందుగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వేసవిలో నీటి కష్టాలు మొదలయ్యే అవకాశం ఉన్నందున ఆ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు […]

Update: 2020-04-30 05:08 GMT

దిశ, రంగారెడ్డి: జిల్లాలో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వెంటనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మీర్‌పేట్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులపై గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో తన కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్‌డౌన్ తొలగించాక ముందుగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వేసవిలో నీటి కష్టాలు మొదలయ్యే అవకాశం ఉన్నందున ఆ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కాగా, లాక్ డౌన్ నిబంధనల సడలింపు, ఆంక్షల ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్ , డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్‌పేట మున్సిపల్ కమిషనర్, బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

tags :pending projects, clear, minister sabitha indra reddy, rangareddy

Tags:    

Similar News