ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటించాలి : పువ్వాడ

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డంలో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఎస్ఆర్ ట్రస్ట్ త‌రుపున శుక్రవారం జెడ్పీహాల్‌లో 12వేల లీట‌ర్ల శానిటైజ‌ర్‌, 12వేల మాస్కుల‌ను మంత్రి అజ‌య్‌కుమార్ చేతుల మీదుగా క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌ణ్‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైర‌స్‌పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ను అతిక్రమించొద్దనికోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని […]

Update: 2020-04-24 02:50 GMT

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డంలో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఎస్ఆర్ ట్రస్ట్ త‌రుపున శుక్రవారం జెడ్పీహాల్‌లో 12వేల లీట‌ర్ల శానిటైజ‌ర్‌, 12వేల మాస్కుల‌ను మంత్రి అజ‌య్‌కుమార్ చేతుల మీదుగా క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌ణ్‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైర‌స్‌పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ను అతిక్రమించొద్దనికోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని కోరారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగుల‌కు పీఎస్ఆర్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో అంద‌జేసిన సామాగ్రిని పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌కు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, అదనపు డీసీపీ మురళీధర్, తదితరులు ఉన్నారు.

Tags : Minister, presented, sanitizers, collector, ex mp ponguleti srinivas

Tags:    

Similar News