‘కేసీఆర్‌ను అంటుంటే.. మా రక్తం మరుగుతోంది’

దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నూతనంగా నిర్మించనున్న టీఎస్‌ ఆర్టీసీ శాటిలైట్‌ బస్‌ డిపోకు పువ్వాడ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు ఇవ్వకుండా గోదావరిలో ఏడు మండలాలను ముంచి దుమ్ముగూడెం, రాజీవ్‌‌సాగర్‌ పేరిట వందల కోట్లు మింగిన కాంగ్రెస్‌ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే ఆర్హత లేదని […]

Update: 2021-02-11 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నూతనంగా నిర్మించనున్న టీఎస్‌ ఆర్టీసీ శాటిలైట్‌ బస్‌ డిపోకు పువ్వాడ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు ఇవ్వకుండా గోదావరిలో ఏడు మండలాలను ముంచి దుమ్ముగూడెం, రాజీవ్‌‌సాగర్‌ పేరిట వందల కోట్లు మింగిన కాంగ్రెస్‌ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే ఆర్హత లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్ దద్దమ్మలు తమ పాలనలో తెలంగాణాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై అడ్డగోలు విమర్శలు చేస్తే.. చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. అంతేగాకుండా.. సీఎంపై విమర్శలు చేస్తుంటే తమ రక్తం మరుగుతోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని అన్నారు.

Tags:    

Similar News