గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..
దిశ, ఖమ్మం : ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలి అనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలను అధికారిక లాంఛనాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన స్తంభాద్రి ఉత్సవ సమితిని అభినందించారు. అనంతరం నిమజ్జన తీరును నిమజ్జన ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఎక్కడ అపశృతులు లేకుండా జాగ్రత్తలు […]
దిశ, ఖమ్మం : ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలి అనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలను అధికారిక లాంఛనాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన స్తంభాద్రి ఉత్సవ సమితిని అభినందించారు. అనంతరం నిమజ్జన తీరును నిమజ్జన ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఎక్కడ అపశృతులు లేకుండా జాగ్రత్తలు వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఇప్పటికే అన్ని నిమజ్జన కేంద్రాలలో ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వారికి అభినందనలు తెలియజేశారు.
మట్టి వినాయకుడిని పూజించాలనే ఆకాంక్షతోనే స్థంబాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ తరుపున విద్యుత్ చార్జీల నిమిత్తం రూ.3లక్షలు, పోలీస్ పర్మిషన్ నిమిత్తం రూ. 60వేలు చెల్లించామన్నారు. వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయిలో మట్టి వినాయకుడినే ప్రతిష్టించి ఆరాధించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్ట్ ఆఫ్ పారిస్ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. వేలాది మంది పాల్గొనే గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని మంత్రి అన్నారు. కాల్వఒడ్డులో అవాజ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు.