మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి…
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరం 5వ డివిజన్‌లో ముమ్మరంగా కొనసాగుతున్న ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 4వ తేదీన చెరువును సందర్శించి చెరువును లకారం పార్కు ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖమ్మంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. చెరువుకు చుట్టూ […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరం 5వ డివిజన్‌లో ముమ్మరంగా కొనసాగుతున్న ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 4వ తేదీన చెరువును సందర్శించి చెరువును లకారం పార్కు ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖమ్మంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. చెరువుకు చుట్టూ విశాలమైన బండ్ నిర్మించి, ఒకవైపు ఫెన్సింగ్ మరో వైపు మొక్కలతో గ్రీన్ వాల్, గ్రీనరీ, లైటింగ్, అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేసి అతి త్వరలో పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్‌తో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెనున్నట్టు వెల్లడించారు.