ఆ మార్కులు… మూడేళ్లు చెల్లుబాటు

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడించింది. కాగా ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వివిధ పరీక్షలను ఒకే ఉమ్మడి పరీక్ష ద్వారా (సీఈటీ) నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ… నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతో వివిధ […]

Update: 2020-08-19 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడించింది. కాగా ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వివిధ పరీక్షలను ఒకే ఉమ్మడి పరీక్ష ద్వారా (సీఈటీ) నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ…

నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతో వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగార్థులు ఇకపై సీఈటీ పరీక్షను ఆన్ లైన్లో రాస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చుల భారం తగ్గుతుందని.. ఉద్యోగార్థులకు అనవసర శ్రమ ఉండదని, సమయం కలిసి వస్తుందని చెప్పారు.

దీని కింద నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా ఆల్ లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులు మూడేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయి. తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. మరో రెండు అదనపు ఛాన్సులు ఉంటాయి. మూడింట్లో ఎక్కువగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు.

Tags:    

Similar News