హైపో క్లోరైట్ స్ప్రే చేసిన 'మంత్రి తలసాని'

దిశ, హైదరాబాద్ : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని పలు ఏరియాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అగ్నిమాపక సిబ్బంది స్ప్రే చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూపతో కలిసి పరిశీలించిన మంత్రి తలసాని స్వయంగా ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. అత్యవసరమైతే తప్ప […]

Update: 2020-04-01 09:14 GMT

దిశ, హైదరాబాద్ :

కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని పలు ఏరియాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అగ్నిమాపక సిబ్బంది స్ప్రే చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూపతో కలిసి పరిశీలించిన మంత్రి తలసాని స్వయంగా ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని.. మార్కెట్లు, దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్, అదనపు అధికారి ధనుంజయ్ రెడ్డి, సికింద్రాబాద్ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: corona, Hypocloride, minister talasani, seunderabad

Tags:    

Similar News