ఎరువుల కొరత ఉండొద్దు : నిరంజన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం పంట సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత అసలు ఉండొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ కమిషనరేట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎరువులు , రైతు వేదికల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల కొరత లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని చెప్పారు. అలాగే, కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కోటాను ఎప్పటికప్పుడు డ్రా చేయాలని సూచించారు. […]
దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం పంట సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత అసలు ఉండొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ కమిషనరేట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎరువులు , రైతు వేదికల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల కొరత లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని చెప్పారు. అలాగే, కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కోటాను ఎప్పటికప్పుడు డ్రా చేయాలని సూచించారు. అదేవిధంగా దసరా నాటికి రైతు వేదికలు సిద్దం కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.