వనపర్తి, కొత్తకోట అభివృద్ధికి చర్యలు: మంత్రి నిరంజన్‌రెడ్డి
దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి- కొత్తకోట మధ్యగల ప్రభుత్వ స్థలాల్లో విద్యాసంస్థలు, గోదాంలు, ఆగ్రో పారిశ్రామికవాడల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ డీ వేణు గోపాల్‌తో కలిసి ఆయన జిల్లాలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. సంకిరెడ్డిపల్లి వద్ద గల 225 సర్వే నంబర్‌లోని 33.12 ఎకరాల స్థలాన్ని సందర్శించారు. రానున్న రోజుల్లో వనపర్తి, కొత్తకోట పట్టణాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు […]
దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి- కొత్తకోట మధ్యగల ప్రభుత్వ స్థలాల్లో విద్యాసంస్థలు, గోదాంలు, ఆగ్రో పారిశ్రామికవాడల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ డీ వేణు గోపాల్‌తో కలిసి ఆయన జిల్లాలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. సంకిరెడ్డిపల్లి వద్ద గల 225 సర్వే నంబర్‌లోని 33.12 ఎకరాల స్థలాన్ని సందర్శించారు. రానున్న రోజుల్లో వనపర్తి, కొత్తకోట పట్టణాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ పట్టణాల మధ్య ఉన్నత విద్యా సంస్థలు, గోదాంలు, ఆగ్రో పారిశ్రామికవాడల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకుగాను ఆయా సర్వే నంబర్లలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి మార్కింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉండేలా, ప్రత్యేకించి వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలు రెండింటికి ఉపయోగపడేలా గోదాం నిర్మాణానికి స్థలాన్ని చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రీయల్ పార్కు, ఆటోనగర్, ఆగ్రో ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు.
tags: minister niranjan reddy, constructions, wanaparthy,kottakota places