కరోనా నివారణపై మంత్రి సమావేశం

దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి కర్నూల్ జిల్లాకు చాలామంది రాకపోకలు చేసే అవకాశం ఉందని.. దీంతో కరోనా సోకె ప్రమాదం ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దీనిపై రెండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీజేపీ అతిథి గృహంలో వనపర్తి, గద్వాల జిల్లాల  శాసన సభ్యులు, ఎంపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌మిషన్ వల్ల […]

Update: 2020-04-10 05:45 GMT

దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి కర్నూల్ జిల్లాకు చాలామంది రాకపోకలు చేసే అవకాశం ఉందని.. దీంతో కరోనా సోకె ప్రమాదం ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దీనిపై రెండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీజేపీ అతిథి గృహంలో వనపర్తి, గద్వాల జిల్లాల శాసన సభ్యులు, ఎంపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌మిషన్ వల్ల వ్యాధి సోకడానికి అవకాశం ఉందన్నారు. అయితే. అన్ని గ్రామాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయించాలని తెలిపారు. గ్రామాలలో యువత అనవసరంగా ఇండ్ల నుంచి బయటకి వస్తున్నారని.. దీనిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

Tags: minister niranjan reddy, comments, Corona Prevention, wanaparthy

Tags:    

Similar News