ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరోలా.. బీజేపీ నేతలపై మంత్రి మల్లారెడ్డి ఫైర్
దిశ, ప్రతినిధి, మేడ్చల్: బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరో లాగా మాట్లాడుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేడ్చల్ జిల్లాలో సోమవారం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఘట్ కేసర్ మండలం, ఎదులాబాద్ లో నిర్వహించిన ఆందోళనలో మంత్రి […]
దిశ, ప్రతినిధి, మేడ్చల్: బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరో లాగా మాట్లాడుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేడ్చల్ జిల్లాలో సోమవారం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఘట్ కేసర్ మండలం, ఎదులాబాద్ లో నిర్వహించిన ఆందోళనలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర బీజేపీ, కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ కి తెలంగాణలో స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు, రైతులు చేస్తారన్నారు.
కేంద్రం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులను నట్టేట ముంచుతుందని మండి పడ్డారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉందన్నారు. ఇప్పటికే మొదటి పంటకు ఇబ్బంది పెడుతూ, రెండవ పంట కొనమని అంటున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎక్కడిక్కడ ప్రశ్నించి నిలదిద్దామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావని యాదవ్, కొండల్ రెడ్డి, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.