మున్సిపాలిటీల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి : కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: మున్సిపాలిటీల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆధారంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అందరూ పని చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంగళవారం కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం నిర్దేశించిన పనులను ఖచ్చితంగా చేపట్టాలన్నారు. పారిశుధ్య కార్మికులకు […]
దిశ, వెబ్‌డెస్క్: మున్సిపాలిటీల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆధారంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అందరూ పని చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంగళవారం కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం నిర్దేశించిన పనులను ఖచ్చితంగా చేపట్టాలన్నారు.
పారిశుధ్య కార్మికులకు దుస్తులు, మాస్కులు, బూట్లను అందించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలే తీసుకోవాలని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ప్రతీ 1000 మందికి ఒక టాయిలెట్ ఉండాలని.. వాటిలో సగంమేర షీ టాయిలెట్లు ఉండాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలని చెప్పారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేయాలని సూచించారు.