మా ఓపిక నశిస్తే.. బీజేపోళ్లు బయట తిరగలేరు: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే.. బీజేపీ నేతలు కనీసం బయట కూడా తిరగలేరని వ్యాఖ్యానించారు. భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందన్న కేటీఆర్.. బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలని, ప్రజాస్వామ్య వాదులంతా బీజేపీ తీరును ఖండించాలని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకునే బలం, బలగం మాకు ఉందని, గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందన్నారు. తమ వాదనతో […]

Update: 2021-01-31 09:30 GMT
మా ఓపిక నశిస్తే.. బీజేపోళ్లు బయట తిరగలేరు: కేటీఆర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే.. బీజేపీ నేతలు కనీసం బయట కూడా తిరగలేరని వ్యాఖ్యానించారు. భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందన్న కేటీఆర్.. బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలని, ప్రజాస్వామ్య వాదులంతా బీజేపీ తీరును ఖండించాలని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకునే బలం, బలగం మాకు ఉందని, గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందన్నారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని, మా సహనానికి కూడా హద్దు ఉంటుందన్న విషయాన్ని బీజేపీ లీడర్లు గుర్తు ఉంచుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.

Tags:    

Similar News