మిడతలతో జాగ్రత్త వహించండి: ఇంద్రకరణ్ రెడ్డి

దిశ, ఆదిలాబాద్: రాష్ట్రానికి మిడతల దాడి పొంచి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్ రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మిడ‌త‌ల నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మిడతల దండును సామూహికంగా నివారించేందుకు […]

Update: 2020-05-28 07:24 GMT

దిశ, ఆదిలాబాద్: రాష్ట్రానికి మిడతల దాడి పొంచి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్ రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మిడ‌త‌ల నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మిడతల దండును సామూహికంగా నివారించేందుకు రైతులలో చైతన్యం కల్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

Tags:    

Similar News