అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష

దిశ, మెదక్: సిద్దిపేట కలెక్టరేట్‎‎లో కరోనా ఏర్పాట్లపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందకుండా సిద్దిపేట జిల్లాలో పకడ్బంధీగా చర్యలు చేపట్టాలన్నారు. […]

Update: 2020-03-26 07:25 GMT

దిశ, మెదక్: సిద్దిపేట కలెక్టరేట్‎‎లో కరోనా ఏర్పాట్లపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందకుండా సిద్దిపేట జిల్లాలో పకడ్బంధీగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 239 మంది క్వారంటైన్‎లో 14 రోజులు పూర్తి చేసుకున్న వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. కూరగాయల క్రయవిక్రయాలు ఇక నుంచి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయంగా వారంలో మూడు రోజులేనని.. ఆది, బుధ, శుక్రవారం రోజులు తాత్కాలిక మార్కెట్లు నడుస్తాయన్నారు.

Tags: Minister Harish Rao, review, officials, siddipet

Tags:    

Similar News