ఏడేళ్లలో అనుకున్న పనిచేశాం : మంత్రి హరీష్ రావు

దిశ, గజ్వేల్: పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా శనివారం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో మంత్రి హరీష్ పర్యటించారు. క్షీరసాగర్ గ్రామానికి హరీష్ రావు నిధుల వర్షం కురిపించారు. రూ.1.6 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభించిన అనంతరం శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని జేసీబీతో కూల్చివేశారు. […]

Update: 2021-07-03 01:28 GMT
Minister Harish Rao
  • whatsapp icon

దిశ, గజ్వేల్: పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా శనివారం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో మంత్రి హరీష్ పర్యటించారు. క్షీరసాగర్ గ్రామానికి హరీష్ రావు నిధుల వర్షం కురిపించారు. రూ.1.6 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభించిన అనంతరం శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని జేసీబీతో కూల్చివేశారు. క్షీరసాగర్ గ్రామంలో రూ.30 లక్షల రూపాయల వ్యయంతో పూర్తయిన యూజీడీ- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన తర్వాత గ్రామ మోడల్ బస్టాండ్- ప్రయాణ ప్రాంగణాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

పల్లె ప్రకృతి వనంలో మొక్కనాటి ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.50 లక్షలతో విలేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, రూ.6 లక్షలతో పల్లె ప్రకృతి వనం ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. క్షీరసాగర్ గ్రామ పల్లె ప్రకృతి వనం సుందరంగా చాలా బాగుందని ప్రశంసించారు. తెలంగాణ రాక ముందు పల్లెలు ఏలా ఉన్నాయో..? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పల్లెలు ఏలా మారాయంటూ.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏళ్లలో అనుకున్న అభివృద్ధి పనులు చేసి చూపించామని మంత్రి వెల్లడిచారు.

బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి, మొదటి ఆయిల్ ఫామ్ మొక్కను మంత్రి నాటారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఎంపీపీ లావణ్య అంజన్ గౌడ్, సర్పంచ్ కాయితి యాదమ్మ, ఎంపీటీసీ మమతబల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జహంగీర్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, జుబేర్ పాషా, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News