కిషన్‌ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఫైర్.. చెప్పేవన్నీ అబద్ధాలే..

దిశ, నారాయణఖేడ్ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లతో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమావేశమైయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కంటే ఎక్కువగా టీఆర్ఎస్ హయాంలోనే అధికంగా వడ్లు కొన్నామని తెలిపారు. జిల్లాలో సాగు నీరు అందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల అమలుకు […]

Update: 2021-11-30 00:50 GMT

దిశ, నారాయణఖేడ్ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లతో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమావేశమైయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కంటే ఎక్కువగా టీఆర్ఎస్ హయాంలోనే అధికంగా వడ్లు కొన్నామని తెలిపారు. జిల్లాలో సాగు నీరు అందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల అమలుకు రూ. 4,427 కోట్లు మంజూరు చేశామన్నారు.

నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగికి వడ్లు ఎంత కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బాయిల్డ్ రైస్ పేరిట అబద్ధాలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆయన స్థానిక ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడ వైద్యులు, రోగులతో మాట్లాడారు.

Tags:    

Similar News