డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులపై మంత్రి సమీక్ష

దిశ, మెదక్: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సాపూర్‌లో నిర్మిస్తున్న జీ+డబుల్ బెడ్ ఇళ్ల‌ను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల ప్రగతి పనులపై మంత్రి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటికే 2 వేల పైచిలుకు ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా గృహా ప్రవేశాలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి […]

Update: 2020-06-01 08:21 GMT
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులపై మంత్రి సమీక్ష
  • whatsapp icon

దిశ, మెదక్: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సాపూర్‌లో నిర్మిస్తున్న జీ+డబుల్ బెడ్ ఇళ్ల‌ను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల ప్రగతి పనులపై మంత్రి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటికే 2 వేల పైచిలుకు ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా గృహా ప్రవేశాలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రత్యేకించి కమ్యూనిటీ హాల్, స్వాగత ద్వారం, పోలీసు ఔట్ పోస్టు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ అనంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ కనక రత్నం, డీఈ వేణు, తహసీల్దార్ విజయ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News