సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావుకు మహిళల గండం..
దిశ ప్రతినిధి, మెదక్: అధికార టీఆర్ఎస్‌కు రాబోయే కాలంలో గడ్డు రోజులు తప్పవా అంటే తప్పవనే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల సీఎం సిద్దిపేట పర్యటన తర్వాత అధికార పార్టీ నాయకుల్లో అసహనం పెరిగింది. జిల్లా మంత్రికి సైతం పలు గ్రామాల్లో నిరసన సెగలు తాకాయి. ఇటీవల జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభంలో మంత్రి ప్రసంగిస్తుండగా పలువురు మహిళలు లేచి మంత్రి ప్రసంగానికి అడ్డుపడ్డారు. మర్కూక్ మండలలోని పాములపర్తి గ్రామంలో రాష్ట్ర […]
దిశ ప్రతినిధి, మెదక్: అధికార టీఆర్ఎస్‌కు రాబోయే కాలంలో గడ్డు రోజులు తప్పవా అంటే తప్పవనే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల సీఎం సిద్దిపేట పర్యటన తర్వాత అధికార పార్టీ నాయకుల్లో అసహనం పెరిగింది. జిల్లా మంత్రికి సైతం పలు గ్రామాల్లో నిరసన సెగలు తాకాయి. ఇటీవల జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభంలో మంత్రి ప్రసంగిస్తుండగా పలువురు మహిళలు లేచి మంత్రి ప్రసంగానికి అడ్డుపడ్డారు. మర్కూక్ మండలలోని పాములపర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించలేదని ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కొండపాక మండలం తిప్పారం లోను అదే ఘటన చోటుచేసుకుంది.
మంత్రి ప్రసంగం అడ్డగింత…
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీశ్ రావు గురువారం కొండపాక మండలంలోని తిప్పారం గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. అయితే ప్రసంగం మధ్యలోనే పలువరు మహిళలు లేని మాకు తాగునీటి సమస్య ఉందని తెలిపారు. మరికొందరు డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని, ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపినేసి ఎవ్వరితో మాట్లాడకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయారు. ఇటీవల వరుసగా మంత్రికి పలు చోట్ల నిరసన సెగ ప్రారంభం కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక మంత్రి కి గడ్డు రోజులు ప్రారంభమయ్యాయని, అధికార టీఆర్ఎస్ కు స్వంత గడ్డలో వ్యతిరేకత ప్రారంభమైందని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.