కొండపోచమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్.. బోనమెత్తిన జోగిని శ్యామల

దిశ, జగదేవపూర్ : తెలంగాణలో అత్యంత ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆలయం వద్ద టీఆర్ఎస్ నాయకుడు, వార్షికోత్సవ దాత అశోక్ యాదవ్ వేసిన సదరుపటంకు హాజరయ్యారు. […]

Update: 2021-11-25 03:52 GMT

దిశ, జగదేవపూర్ : తెలంగాణలో అత్యంత ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆలయం వద్ద టీఆర్ఎస్ నాయకుడు, వార్షికోత్సవ దాత అశోక్ యాదవ్ వేసిన సదరుపటంకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రజలందరిని చల్లగా చూడుమని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. జోగిని శ్యామల బోనం ఎత్తుకొని, డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి చెంతకు చేరుకున్నారు. పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్షికోత్సవంలో భాగంగా రెండవ రోజు ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి, ఎఎంసీ చైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణ, గ్రామ సర్పంచ్ రజిత రమేశ్, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కొండపోచమ్మ ఆలయ డైరెక్టర్‌లు పబ్బ శ్రీహరి గౌడ్, నరేష్, పీఎసీఎస్ డైరెక్టర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News