‘సాగు లాభసాటిగా మారాలి’

దిశ, మెదక్: సాగు లాభసాటిగా మారి, అన్నదాత ఆత్మగౌరవంగా బతకడం కోసం కొత్త విధానం తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి గోకుల్ ఫంక్షన్ హాల్లో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం.. లాభసాటి వ్యవసాయంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోత ఉండేదన్నారు. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యమని, వచ్చే సంవత్సరం పత్తికి […]

Update: 2020-05-23 10:23 GMT

దిశ, మెదక్: సాగు లాభసాటిగా మారి, అన్నదాత ఆత్మగౌరవంగా బతకడం కోసం కొత్త విధానం తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి గోకుల్ ఫంక్షన్ హాల్లో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం.. లాభసాటి వ్యవసాయంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోత ఉండేదన్నారు. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యమని, వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. వానకాలంలో 25 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారని, అయితే రైతులు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. కందులను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 20,503 మంది రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మానిక్ రావు, చంటి క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News