‘288 ’బస్తీ దవాఖానలు ఏర్పాటు.. మంత్రి హరీష్ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రావడం వలన పట్టణాల్లో నివసించే పేదల వైద్య ఖర్చుల భారం తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉచితంగా టెస్టులు, మందులు, చికిత్సలు నిర్వహించడం వలన ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఈ సేవలను మరింత విస్తరింపచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో 288 మంది బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని […]
దిశ, తెలంగాణ బ్యూరో: బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రావడం వలన పట్టణాల్లో నివసించే పేదల వైద్య ఖర్చుల భారం తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉచితంగా టెస్టులు, మందులు, చికిత్సలు నిర్వహించడం వలన ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఈ సేవలను మరింత విస్తరింపచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో 288 మంది బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో వైద్యారోగ్య ,మున్సిపల్ శాఖలతో మంత్రి కేటీఆర్‌తో కలిసి హరీష్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయన్నారు. ఇదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీల్లో మరో 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు దశల్లో వచ్చే జూన్ 2 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 544 బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనాభా సంఖ్య, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ శాఖ మౌలిక సదుపాయాలను, ఆరోగ్య శాఖ వైద్య పరికరాలను సమకూర్చుతుందన్నారు. టీ డయాగ్నస్టిక్ సహకారంతో కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల్లో ఎక్కడిక్కడే శాంపిల్స్ సేకరణ ఉంటుందన్నారు. ఉచిత వైద్యం, ఉచిత మందులతో పాటు, రోగ నిర్ధారణ పరీక్షలకు చేసే ఖర్చు కూడా పేదలకు తప్పుతుందని మంత్రి చెప్పారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీ ఎస్ టీ ఎస్ వెంకటేశ్వర్ రావు, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్యశాఖకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
నీతి అయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి హరీశ్ రావు, ఆరోగ్య సిబ్బందికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడు ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షత వల్ల ప్రభుత్వ వైద్య రంగం ముందుకు దూసుకు వెళ్తుందన్నారు. గతేడాది 4వ స్థానం నుండి ఈ ఏడాది 3వ స్థానానికి చేరడం అభినందనీయం అన్నారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. బస్తీ దవాఖానల పనితీరు బాగుందని, తమ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని చాలా వినతులు వస్తున్నాయన్నారు. ఐటీ శాఖ నుండి వైద్యారోగ్య శాఖకు అవసరమైన సాంకేతిక సమాచారం అందిస్తామన్నారు.