భక్తుల కోసం బస్ స్టేషన్.. మంత్రి చేతుల మీదుగా..

దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తుల కోసం బస్ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా దేవస్థానం నిధుల నుండి రూ.50 లక్షలు, tsrtc నిధుల నుండి రూ.50 లక్షలు మొత్తం కోటి రూపాయలతో మరమ్మత్తులు చేపట్టి భక్తుల సౌకర్యార్ధం ఆధునికీకరించారు. ఈ బస్ స్టేషన్‌ను ఆదివారం మంత్రి హరీష్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ఆలయ చైర్మన్ గిస భిక్షపతి స్థానిక నాయకులు, […]

Update: 2021-12-26 09:03 GMT

దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తుల కోసం బస్ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా దేవస్థానం నిధుల నుండి రూ.50 లక్షలు, tsrtc నిధుల నుండి రూ.50 లక్షలు మొత్తం కోటి రూపాయలతో మరమ్మత్తులు చేపట్టి భక్తుల సౌకర్యార్ధం ఆధునికీకరించారు. ఈ బస్ స్టేషన్‌ను ఆదివారం మంత్రి హరీష్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ఆలయ చైర్మన్ గిస భిక్షపతి స్థానిక నాయకులు, RTC అధికారులు హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్, మెదక్ రీజినల్ మేనేజర్ ఎన్ సుదర్శన్, సిద్దిపేట డివిజనల్ మేనేజర్ ఏ సరిరామ్ , చీఫ్ ఇంజనీర్ రామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News